22, జులై 2015, బుధవారం

time machine :కాల యంత్రం by rasp sadhana

science for and with children by *mpsmkbh@

చిన్నారులకోసం శాస్త్రీయవిజ్ఞ్యానం:ప్రకృతి, సంస్కృతి, రోదసి, మొదలైన వాటి గురించి చిన్నారులతోనే సంభాషిస్తూ సాగే విజ్ఞ్యానవిన్యాసాల వ్యాసాలు.మీకోసం… science for children: these are conversational scientific marching essays about nature, culture and space for and with children.for you…

time machine :కాల యంత్రం by rasp sadhana

     Image result for time machine

మామూలుగా అమర్ మామయ్యా చుట్టూ పిల్లలూ మూగారు.
“మామయ్యా, ‘టైం మెషీన్’ అంటే ఏమిటీ?” అనయ్ అడిగాడు. వాచ్, క్లాక్, కేలండర్ ఇవ్వన్నీ టైం ని తెలిపే మేషిన్సే గదా”. అన్నారంతా.
“కరెక్టే, అవన్నీ టైం ని తెలిపేవే; కాని, విడు స్పెసిఫిక్ గా హెచ్.జీ. వేల్స్ గారి టైం మెషిన్ గురించి అందుకు అడుగుతున్నాడో మరి...”. మామ ఏమీ తెలియనట్లు...
“ఎమ్డుకంటే, టైం మెషిన్ మనల్ని పాస్ట్/గతంలోకి తీస్కెళ్ళి పోతుంది-ట. ఇంకా ఫ్యూచర్/భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది-ట కదా.” 
“అవును, ‘ఆదిత్యా-369’ లో సింగీతం... గారు చూపించారు గదా”. 
“మరి అప్పుడేమౌతుంది?.... నిజంగానే తీసుకెళ్తుం దా? మరి మళ్లీ కరెంట్/ప్రెజెంట్ కి వచ్చేస్తామా లేదా...”.
“అస్సలు అల్లా కాలంలో అటూ ,ఇటూ వెళ్ళటం, రావటం...కుదిరే పనేనా?!’.
“ఎందుకు కుదరదూ?!, మనం ఇక్కడినించి ఎక్కడి కయినా వెళ్లి, తిరిగి రావటం లేదా!?... అల్లానే...”.

Image result for time machine     Image result for time machine

“మరి మనం హిస్టారికల్, మితలాజికల్ సినిమాలు, డ్రామాలు యమ కాన్సర్టేషన్ తో.... చూస్తూ ఉంటాం కదా, మరి అప్పుడు, అవి రూపొందించిన డైరెక్టర్లు, ఆయన టీం... మనల్ని పాస్ట్/ఫ్యూచర్ లోకీ తీసుకెళ్తున్నట్లు ఫీలౌతాముగదా!, అవునా, కాదా....”.
“అవును, అప్పుడు కధల్లో కేవలం ప్రెజెంట్/వర్తమానమే కాకుండా... కొన్నిసార్లు పాస్ట్... ఇంకొన్ని సార్లు ఫ్యూచర్... చాలా సార్లు ఇమేజినేషన్సు/వూహలు... ఇల్లా మన మనస్సుల్ని లాక్కెళ్ళి పోతుంటారు కదా!?”.
“విలన్ కార్ ని హీరో బైక్ వెంబడించినపుడు... వాళ్ళు మేగ్జిమం చాలా చాలా దూరాలలో వున్నపుడు... స్క్రీన్ మీద ఒక్కే సారి, పక్క పక్కగా వున్నట్లు చూపిస్తారు చూడండి, అది మరి ‘టైం మెషిన్ కాన్సెప్టే’... ఒకే ఏరియా కాబట్టీ, ఒక్కే సమయం: అనే ఫీలింగులో అది ఎంజాయ్ చేసేస్తాం. అర్ధం అవుతోందా?!...”.

Image result for time machine      Image result for time machine

“మళ్లీ చెబుతున్నా జాగ్రత్తగా వినండి.- “విలన్ కార్ ని హీరో బైక్ వెంబడించినపుడు... వాళ్ళు మేగ్జిమం చాలా చాలా దూరాలలో వున్నపుడు... స్క్రీన్ మీద ఒక్కే సారి, పక్క పక్కగా వున్నట్లు చూపిస్తారు చూడండి, అది మరి ‘టైం మెషిన్ కాన్సెప్టే’... ఒకే ఏరియా కాబట్టీ, ఒక్కే సమయం: అనే ఫీలింగులో అది ఎంజాయ్ చేసేస్తాం. ఓకే! ఐతే, అదే కార్, బైక్ ఛేజింగు బిట్వీన్ విజయవాడ/ఇండియా ఎండ్ న్యూయార్క్/అమెరికా జరుగుతోంది... అని వుహిద్దాం!...”.
“మరి మధ్యలో అంతా లాండ్ కాదుగా..., మద్యలో సముద్రాలని ఇండియన్, ఆఫ్రికన్ ఏనుగులతో తాగించేద్దామా... ఫుల్ గా...”. అన్నది సాధన.

Image result for time machineImage result for bike chases a car   Image result for bike chases a car
 
 

“ఓకే ఓకే... చెప్పేది వినండి మరి... మనం ఒక్క సారి కాలిఫోర్నియా లోని సుమస్వర, సునేరీ లని నెట్ లో పలకరిద్దాం; అల్లాగే అదే టైం లో లండన్ లోని కోవిద, హవిష్ లని కూడా పలకరిద్దాం. అల్లాగే అదే టైం లో ఆస్ట్రేలియా లో మన అమూల్య, సంపత్ వాళ్ళని కూడా... ఒకే!...”. కాలిఫోర్నియా కనెక్టు అయింది.

Image result for bedroom children    Image result for bedroom children   Image result for globe   Image result for globe

‘హల్లో సుమస్వర, సునేరీ ఏంచేస్తున్నారు?...”. “మేమా, నైట్ 11.45అవుతోంది; చదువులు, డ్యాన్సులు, భోజనాలు అయ్యాయి. ఇంక డేట్ మారలేదు. ఇక్కడ 31 డిసెంబరు, 2015 ఇంకా నడుస్తోంది”: సుమస్వర.

Image result for night 11.45 clocks      Image result for californiaImage result for california   Image result for california
 

“ఇంకో పావు గంటలో డేట్, మంత్, యియర్ అన్నీ మారిపోతాయి. మీ దెగ్గిర ఎల్లా వుంది?, ఏం చేస్తున్నారు?”:సునేరీ
“ఇక్కడ 1 జనవరి 2016 మిడ్ నూన్ 12.15 దాటింది. అవ్వన్నీ ఇక్కడ మారి, 11, 12 గంటలు దాటే శాయి. మేము లంచ్ కి రెడీ అవుతున్నాము. అంటే మీరూ, మీ పరిసరాలు మా గతం/పాస్ట్ లో వున్నారన్నమాట...”.

Image result for indiaImage result for indiaImage result for lunch time funnyImage result for lunch time funny  Image result for lunch time funny
 
 
Image result for lunch time funny         Image result for globe

“అన్నట్లు, హేపీ న్యూ యియర్ టు ఆల్ ఆఫ్ యూ...”. 
“సేం టు యూ, హేపీ న్యూ యియర్ టు యూ...” అనుకున్నారు అంతాను.
“అంటే మీరు మా భవిష్యత్/ఫ్యూచర్ లో ఉన్నారన్నమాట;
“అంతేగా; కానీ, ఎవరికీ వాళ్ళం వాళ్ళ వర్తమానం/ప్రెజెంట్ లోనే వుంటూనే ఇల్లా, ఇదంతా జరుగు తోంది కదా. సో, ఇదే ‘టైం మెషీన్’ కాన్సెప్ట్. మీరల్లాగే ఆన్ లోనే వుండండి. లండన్ లో హవిష్ వాళ్ళని కలుద్దాం. వాళ్లేమని అంటారో చూద్దాం!?”.లండన్ కనెక్టు అయింది. 
“హల్లో హవిష్, కోవిదా హవ్ ఆర్ యూ?!... హేపీ న్యూ యియర్ టు యూ...”
“సేం టు యూ... న్యూ యియర్ గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ”.
“ఎట్ ప్రెజెంట్, మీరేం చేస్తున్నారు?, మీ పరిసరాలు ఎల్లగున్నాయి!?... కం ఆన్, స్పిక్ ఆన్...”.
“మేము, మాకిక్కడ 1 జనవరి 2016 తెల్లారింది, లేచాం, బ్రష్షు, పేస్టు, బాత్ రూము.... హడావిడిలో ఉన్నాం. మీరేం చేస్తున్నారు?!”.

Image result for england morning   Image result for england morning   Image result for brushing  and morningImage result for brushing  and morning   Image result for brushing  and morningImage result for globe
 
 

“ఇక్కడ మిడ్ నూన్ 12.15 దాటింది. అవ్వన్నీ ఇక్కడ మారి, 5, 6 గంటలు దాటే శాయి. మేము లంచ్ కి రెడీ అవుతున్నాము. అంటే మీరూ, మీ పరిసరాలు, వాచ్ లూ, కేలండర్లు అన్నీ మా గతం/పాస్ట్ లో వున్నారన్నమాట...”.
“అంటే మీరు మా భవిష్యత్/ఫ్యూచర్ లో ఉన్నారన్నమాట;
“అంతేగా; కానీ, ఎవరికీ వాళ్ళం వాళ్ళ వర్తమానం/ప్రెజెంట్ లోనే వుంటూనే ఇల్లా, ఇదంతా జరుగు తోంది కదా. సో, ఇదే ‘టైం మెషీన్’ కాన్సెప్ట్. మీరల్లాగే ఆన్ లోనే వుండండి. ఆస్ట్రేలియాలో మన వాళ్ళని పలకరిద్దాం. వాళ్లేమని అంటారో చూద్దాం!?”.హల్లో, మై డియర్ అమూల్యా,సంపత్ ... హవ్ ఆర్ యూ?!... హేపీ న్యూ యియర్ టు యూ...”
“సేం టు యూ... న్యూ యియర్ గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ”.
“ఓకే!, “ఎట్ ప్రెజెంట్, మీరేం చేస్తున్నారు?, మీ పరిసరాలు ఎల్లగున్నాయి!?... కం ఆన్, స్పిక్ ఆన్...”.

“ఇక్కడ సాయంత్రం 5.45 దాటింది. అవ్వన్నీ ఇక్కడ అయ్యి, 5,6 గంటలు దాటే శాయి. మేము ‘ప్లేగ్రౌండ్ టు హోం’ కి రెడీ అవుతున్నాము. అంటే మీరూ, మీ పరిసరాలు వాచ్ లూ, కేలండర్లు అన్నీ మా గతం/పాస్ట్ లో వున్నారన్నమాట...”.
“అంటే మీరు మా భవిష్యత్/ఫ్యూచర్ లో ఉన్నారన్నమాట”.
“అంతేగా; కానీ, ఎవరికీ వాళ్ళం వాళ్ళ వర్తమానం/ప్రెజెంట్ లోనే వుంటూనే ఇల్లా, ఇదంతా జరుగు తోంది కదా. సో, ఇదే ‘టైం మెషీన్’ కాన్సెప్ట్. మీరల్లాగే అందరూ ఆన్ లోనే వుండండి. ఇప్పుడు ఈ టేబిలు అబ్సర్వు చేయండి.
Mid night in 

Australia

24.00 hrs

31st Dec’2015/1st jan’2016

inthe same time:

Morning in

America

06.00 hrs

31st Dec’2015

in the same time:

Mid noon in

England

12.00 hrs

31st Dec’2015

in the same time:

Evening in
  India
  18.00 hrs/6.00pm 
  31st Dec’2015

మన వసుధైకకుటుంబకం లో ఎక్కడి వాళ్ళం అక్కడే వుంటూ, మన వర్తమానంలోనే వుంటూ, మనం మన గతం/పాస్ట్ లోకి, భవిష్యత్/ఫ్యూచర్ లోకి ప్రయాణించటానికి ‘నెట్ లో చాటింగ్’ అనే దాని ద్వారా కొద్దో,గొప్పో హెచ్.జీ వెల్స్ గారి ‘ టైం మిషిన్’/కాల యంత్రం కాన్ సెప్ట్ లాగానే పని చేస్తుంది. అవునా, కాదా!!!???
“సో,‘గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్ నూన్ ఏండ్.....గుడ్ ఈవినింగ్... టు ఆల్ ఆఫ్ యూ.... ‘ఆల్ లాఫ్ యూ’...”
    Image result for globe@@@@
 

1, ఆగస్టు 2014, శుక్రవారం

Tel.science musings:Competition between time& distance by rasp sadhana

tel.science musings."kaalam duuraala madhya pootee" by *mpsmkbh@







"కాలం దూరాల మధ్య పోటీ" -భట్ సాధన

"టైం ఎంత అయ్యిందిరా?"-విఘ్నేశ్వరున్ని అడిగాడు.-అమర్ మామయ్య  చుట్టూ చూశాడు.


టేబిలు పైన గ్లోబు తిరుగుతోంది.పైన లైటు వెలుగుతోంది.అశ్విక,అర్చన ఆడుకుంటున్నారు


పిల్లలకి ఈసారి అతను మరొక గమ్మత్తైన విషయం చెప్పబోతున్నాడు.చేతి కున్న వాచ్ ని చూస్తూ,


"సాయంత్రం ఐదున్నర..."-అన్నారంతా.


"ఎక్కడ?!"-అన్నాడు కళ్లెగరేస్తూ...

"నీ చేతి వాచీ లోనే..."అన్నారు పిల్లలు.యశ్వంత్,అభినవ్ సాగతీస్తూ.  

"మరి ఇంట్లో గోడమీది గడియారం లోనూ...?!"-

"అక్కడా అంతేగా...ఇంచుమించు".

"మరి పక్కింట్లో...?"

"అక్కడా అంతేగా..."

"మరి అవతలి వీధి బజారులోనూ...?"

"బజారులో ఎంటీ...బెజవాదలోనూ అంతే,బొంబాయ్ లోనూ అంతే "-ఆమాత్రం కూడా మామయ్యకి తెలీదా...అన్నట్లు.

"మంచిది,మరి పొరుగు దేశం పాకీస్తాన్ లో...?"

"అంతేనేమో!!..."-అన్నరంతానూ..

"ఏమీ కాదు,సరిగ్గా సాయంత్రం ఐదు గంటలు..."-అన్నాడు అమరు.

"పాకీస్తాన్ లో వాచీలన్నీ అర గంట లేటేమో.పాపం.?!"-అంది ఉల్లాసంగా ఉమా.

"కారణం అది కాదు గానీ,ఇంకో తమాషా...ఇటు బంగ్లాదేశ్ ఎంతయ్యిందో తెలుసా...?"

"ఏమో..."-అనుమానంగానే అన్నారంతా..

"అక్కడేమో సాయంత్రం ఆరు ,మరి..."

"ఆరా...అక్కడివన్నీ..ఫాస్టేమో..."అనేసింది-లక్ష్మీ.కళ్ళు తిప్పుతూ.. 

"ఇల్లా దేశదేశానికి టైము మారిపోతూ ఉంటే ,మరి కచ్చితంగా ఇప్పుడెంత అయినట్టూ...?"-కిరణ్ సూటిగా చూస్తూ....

"ఒక్క రేఖాంశానికి నాలుగు నిమిషాలు చొప్పున పడమటి నించి తూర్పు కి పెరుగుతూ/ ఐ మీన్ పెంచుతూ లెక్కిస్తారు...."-మామయ్య

"అయితే పది డిగ్రీ లకి నలభై నిమిషాలు తేడా నన్నమాట..."హవిష్ తేల్చేశాడు.

"అది అల్లాగుంచండీ,మనం మధ్యాహ్న్నం లంచ్ లాగించేస్తుంటే,ఆస్ట్రేలియా,న్యూజిలాండు వాళ్ళు హాయిగా ఆడేసుకుంటూ ఉంటారు.తెలిసిందా?!"-మామయ్య.

"అయితే,అదే టైముకి ఇంగ్లాడు వాళ్ళు మార్నింగు  బ్రషింగు  లో ఉమ్తారేమో..?!"-అంది భరణి వేళాకోళం గా..

"తమాషాకైనా నువ్వు చెప్పింది నిజమేనే భరణీ ,జీ.యం.టీ మైనస్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ,కరక్ట్ ..."-భరణి సంతోషానికి హద్దులు లేవు.

"అయితే అదే టైముకి అమెరికా వాళ్ళంతా గుర్రు పెట్టి ,ముసుగు తన్నుతూ ఉంటారు.కదూ."-సుదర్శనీ యాక్షన్ చేస్తూ అన్నది.












"అవునవును,వరల్డ్ కప్ రాత్రంతా మనం టీవీ లలో  చూస్తూంటే,ఆ దేశాల్లో పట్ట పగలు ,భలే..ఉందీ ఇదంతా."-అమూల్య సంతోషంగా అంది.

"మన భూమి గుండ్రంగా ఉందీ,పైగా గిర్రున తిరుగుతోంది గాబట్టీ..."అమృత కోవిద కనిపెట్టేసింది.

"అది కూడా పడమటి నించి తూర్పుకి ...అంతేకదా మామా ...?!"-సుమస్వర ముక్తాయింపు యిచ్చింది.

"ద్రువాలదగ్గర యింకో తమాషా జరుగుతూ ఉంటుంది తెలుసా!?..."-అమరు మామయ్య ...అందరూ నిశ్సబ్దంగా ఆశ్చర్య పోయారు.

"ఉత్తర ధృవం లో ఆరు నెల్ల రాత్రి,-అదే సమయంలో -"

"దక్షణ ధృవం లో ఆరు నెల్ల పగలు -అవునా మామా...?!"-సునేరీ కరక్ట్ గా గెస్ చేసింది.

"ఇకపోతే,ఆ రెండు ధ్రువాల్లో సూర్యుడి ప్రయాణం మన దగ్గరలాగా ఉండదు.తెలుసునా?!"

"తూర్పున బయలుదేరీ,పడమటికి చేరుతాడు."-అమరు మామ సస్పెన్సు మొహం పెట్టాడు.

"ఇక్కడకూడా అంతేగా,దీనిలో తమాషా ఏముందీ?!-కొంపదీసి,మధ్యలో మూడు నెలలకి దక్షిణానికిగానీ చేరతాడా ఏమిటి?!"

-సాధన మొత్తానికి సందేహం లోంచి కూడా విజ్ఞ్యానం సాధించింది.మామయ్య -

"అందుకే కాలం అంటే ఒక ...."అని ఏదో చెప్పబోయేంతలో-

"అన్నాలకి టైము అయ్యింది లోపలికి రండర్రా..."అంటూ అమ్మమ్మ చూడామణి పిలిచేసింది.










                        

                         @@@

Science musings :competition between time &speed by rasp sadhana

science musings"kaalamtho vegam potee"-by *mpsmkbh@

























కాలంతో వేగం పోటీ-   

-సాధన భట్

అపుడు సమయం ఉదయం పది గంటలు,ఆదివారం.అమర్ మామయ్య చుట్టూ పిల్లలున్నారు.
"యేమర్రా మనమ్ యెక్కడ జీవిస్తున్నాము?"
"సందేహం యేముందీ,భూమ్మీద"-కొందరు బయటికీ,కొంతమంది లోపలికీ సమాధానం ఇచ్చారు -ఒక్కసారిగా.
"ఆల్ రైట్,మనంకూచున్నచోటు -మనకి యెంత దూరంలొ ఉందనుకుంటున్నారు?"
సీరియస్ గా అడిగాడు మామయ్య;
అదేమిటి తమాషా ప్రశ్న!-అనుకున్నారు అంతా-పిచ్చి ప్రశ్న అంటే బాగోదని;
"నిజంగానే ఇది గొప్ప ప్రశ్నే;దీనికి జవాబులు మాత్రం రెండున్నాయి-తెలుసా?"

"యేమీ లేదనుకుంటుంటే,రెండున్నాయా-సమాధానాలు"-అనుకున్నారంతానూ.మిగితావాళ్ళ కళ్ళ మెరుపులలో జవాబులు దొరుకుతాయేమొనని ఒకర్ని ఒకరు చూసుకున్నారు పిల్లలు. "సున్నా కిలోమీటర్లు-మొదటి జవాబు ఇదేకదూ"-ఉమ అన్నది నిశ్చయం గా,నవ్వేస్తూ- "కరక్టే..."అన్నారు కొద్దిగా పెద్ద క్లాసులు చదువుతున్న భరణీ,సుదర్శనీ-వంటివారు. "మరి రెండో జవాబు ఆలోచించండీ..."-కవ్వించారు-కిరణ్ లక్ష్మీ; "భూమ్మీద కదా,దాని ఆకారం 'క్లూ'-యేనా మామా..."-అన్నారు సుమస్వరా,సునేరీ ఒక్కేసారి.

"ఆ అర్ధం అయ్యింది,మనం కూర్చోని ఉన్నచోటు -మన నుంచి 39,940 కిలొమీటర్లు దూరం ఉంటుంది.-అంతేనా మామా"-అన్నారు హవిష్,అమూల్య-99% నమ్మకంగా,1% సందేహంగా. "అదెల్లా!?"- కోవిదా,అభినవ్-ధైర్యంగా సందేహించారు. "అదీ భూమి చుట్టుకొలత కదా,-అని ముక్తాయింపు పాడారు -అశ్విక,కార్తికేయా,అర్చన. "అవును,ఇక్కడనుంచి బయలుదేరి సూటిగా వెళ్తూ ఉంటే,39,940 కిలోమీటర్లకి మళ్ళీ బయలుదేరినచోటికే వస్తాం-కదూ మామా..."-అన్నాడు విఘ్నేశ్వరుడు. "కరెక్ట్,రెండు సమాధానాలకు కారణం మనం పోల్చుకున్న దిక్కు బట్టీ ఉంటుంది-అన్నమాట.పోనీండి." 

"మరి రోదశీ-అంటే సూన్యంలో ఈ దూరాల గురించి-అప్పుడెప్పుడో కొన్ని తమాషాలు చెబుతానన్నావుగా మామా..."అని అమూల్య గారంగా అడిగింది.
"అది మరోసారి చూద్దాం,మీరంతా వెళ్ళి,మీ హెచ్ డబల్యూలు చేసేసుకోండి." సశేషించాడు అమర్ మామ.










                                                   @@@

Science musings :competition among time, distance &speed by rasp sadhana

Tel.scince musings "kaalam,duuram,veegala madhya potee" *mpsmkbh@















"కాలమ్,దూరం,వేగాల మధ్య పోటీ"-సాధన భట్

అమర్ మామయ్య చుట్టూ మూగిన పిల్లలని-మాటలతో రోదశీ లోకి తీసికెళ్ళాడు.
'మనం ఈసారి రోదశీలో దూరాలగురించి చూద్దాం!"
"మన భుమి నుంచి చంద్రుడు 384 వేల కిలోమీటర్లు దూరంలో ఉన్నాడు కదా..."అమూల్య చెప్పేసింది.
"అల్లాగే-సూర్యుడు 15 కోట్ల కిలొమీటర్లు దూరమ్లో ఉన్నాడు గా..."హవిష్ ఊరుకోలేదు.
"మరి మిగతా నక్షత్రాల మాటేమిటీ!?"-సాధన సాగతీసింది.
"మన గెలాక్శీలో అవీ సూర్యుడిలాంటివే.
అంతకన్నా పెద్దవీ,చిన్నవీ-కోటానుకోట్లు చాలానే ఉన్నాయి.కొన్నిటికి మన సూర్యుడిలాగానే గ్రహాలు,ఉపగ్రహాలు కూడా ఉన్నాయి."

"వాటిని అల్లాగె ఉంచండి గానీ,వాటిల్లో-'ప్రాక్శిమా సెంచరీ'-అనే పొరుగు నక్షత్రం ఎంత దూరంలో ఉందో తెలుసా!?-నాలుగున్నర కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.అంటే..."
"కాంతికి అక్కడికి వెళ్ళి,వచ్చేయడానికి 9 యేళ్ళు పడుతుంది-అన్నమాట".కిరణ్ మామకి సాయం చేశాడు-తన వెగంలో
"పాపం కాంతికి స్పీడు తక్కువా!?"భరణి జాలిపడింది.
"కాదూ,కాంతి వేగం ఇంతా,అంతా గాదు-ఒక్క సెకనులో మూడు లక్షల కిలోమీటర్లు లాగించేస్తుంది తెలుసా!?"-లక్ష్మి అక్కడున్న వారినందర్నీ ఉలిక్కిపడేలా చేసింది.













"మన జెట్ విమానాలు సెకనుకు ఐదున్నర కిలొమీటర్లతో నడుస్తూఉంటాయి, రోదశీ రాకెట్లు సెకనుకి పన్నెండు కిలొమీటర్లతో దూసుకుపోతూఉంటాయి-కదా"-ఉమ తన వేగాన్ని చూపించింది.

"ఇక పోతే-మన రాకెట్ని కాంతి వేగంతో నడపగలిగితే అది ఆ 'ప్రాక్శిమా సెంచెరీ' కి 9 యేళ్ళల్లో వెళ్ళి వస్తుంది;"-అమర్ మామ కేసి తరువాత యేమి తమాషా వినిపిస్తాడోనని చుస్తున్నారంతానూ;
"ఈ కాంతిరాకెట్ కన్నా స్పీడుగా ఒక్క నెల రోజుల్లో   వెళ్ళి, వచ్చేస్తే సరిపోతుందిగా..."అనేసింది సుదర్శని అమిత వేగంగా.
"అప్పుడు మీ వయసు యేమన్నా మారుతుందా?"
"అబ్బే యేమీ మారదు.."-అనేశారంతానూ.
"లేదు, ఒక్క నెల మారుతుంది-కదా"-
"ఆ అవునూ ఒక్క నెల మారుతుంది,ఐతే-?!"
"యేమవుతుందంటే... నీ క్లాస్ మేట్స్ అందరూ ఇంకా తొమ్మిది తరగతులు దాటిపోయి ఉంటారు".

ఒక 40 కాంతి సంవత్సరాల దూరంలొ ఉన్న ఒక నక్షత్రం దగ్గరికి మనం ,మీరన్నట్లే ఇంకా వేగంగా నిమిషంలో వెళ్ళీ వచ్చేశాం అనుకోండీ. అప్పుడు మీరన్నట్లే, మీ వయసు ఒక్క నిమిషం దాటుతుంది కదా;-కానీ, ఇక్కడ భూమ్మీద యేమవుతుందో తెలుసా-80 యేళ్ళు దాటేస్తుంది.మీకేమన్నా అర్ధం అయ్యిందా?!?!"
-అమర్ మామ అన్నది వారందరికీ 'భయంకరం' గా అర్ధం అయిపోయింది.
"__అని ఒక రష్యన్ పుస్తకంలో 'ఐన్ స్టిన్'-సాపేక్ష సిధ్ధాంతం గురించి వివరిస్తూ-లాన్డావ్,రూమెర్ సైన్స్ రచయితలు చెప్పారు.-అని ముగించాడు అమర్ మామ.











                                                                @@@

14, ఏప్రిల్ 2012, శనివారం

An interview With INFINITY


THIS IS AN INTERVIEW WITH   "INFINITY"

                                                      MUSED BY :mpsmkbh@




ఇదొక చిలిపి సాహసం .కచ్చితమైన అల్లరి .కాదామరి?!
శాస్త్రీయ సిద్ధ్దాంతాలలో ఒక సామాన్య (కామన్ )తత్వం కనపడుతూ ఉంటుంది .ఒకానొక విషయంలో  అంత వరకూ ఉన్న లేక నిలదొక్కుకున్న విషయాలను ఆధారం చేసుకొని ,కొత్తవో లేక కొద్దిగా విచిత్రమైనవో  కనిపెట్టుకుంటూ వస్తూ వుంటారు .
దేనికీ లేని అనంత తత్వం సంఖ్యలకు ఉందని తెలిసి తెలిసి, ఎవ్వరూ నిరూపించ మనరు.ఈ చిన్న ప్రయత్నాన్ని  సహృదయంతో ఆలోచిస్తూ ,ఊహిస్తూ స్వీకరించాలని మనవి. చిన్నపిల్లలు వారి గురువుల సూచనలతో - దీనిని చిన్న సైజు నాటిక గా ప్రదర్సించవచ్చు




  







                                                  @@@
చిమ్మ చీకటిలో తళుక్కుమని మెరిసిన మెరుపుని ఫోటోలోకో, యూ ట్యూబ్  లోకో లాగేసి నట్టు :మొన్నా మధ్యన అనంతం గారితో ఓ చిన్న సైజు ఇంటర్వ్యూ లభించింది .సూటిగా వివరాల్లోకి వెళ్ళిపోదాం .ఒకే !
పలకరింపులూ మర్యాదలూ  అయ్యాక : 
"మరి మీరు సంఖ్యేనా?"
"నీకెందు కొచ్చిందీ  ఆ సందేహం!-సరే నాకు ముందున్నవన్నీ సంఖ్యలే అయితే నేనూ సంఖ్యనే అన్నాననుకో ..."
"మీక్కూడా వాటి లక్షణాలు ,గుణాలూ ప్రతి క్షేపించవచ్చు, ఊహించవచ్చు గదా అనీ...ఆశ .దానితో మీ దివ్య దర్శనభాగ్యం లభిస్తుందనీ మా  తరతరాల గణిత విద్యార్ధుల ,శాస్త్రజ్ఞ్యుల చిరకాల వాంఛ ."
"సంతోషం ,ఆ అనుమతిని ఇచ్చాననుకో ...నాకున్న ముఖ్య అనంత తత్వం ,శాశ్వత తత్వం  లాంటివి పలు సందేహాలకు దారి తీస్తాయ్ .నీ ప్రతిక్షేపణలు  ఆక్షేపణలకు గురై పోతాయి మరి తట్టుకో గలవా ?!"



















"గణితశాస్త్ర ప్రతిక్షేపణలు  లేకుండా ఏ ప్రకృతిక మరియూ సాంఘిక శాస్త్రం ఎదిగిందీ ,బట్ట కట్టిందీ -చెప్పండీ !?"
"సరే -నాకు ఇతర సంఖ్యల లక్షణాలు ఆపాదించి  చూడు :ఆ పైన నీ ఇష్టం :మురిసిపోతావో ,ఆశ్చర్యపోతావో ,నిన్ను నువ్వే చీవాట్లు పెట్టుకుంటావో ,మొదలెట్టూ,ఊ ..."
"మీరేమీ అనుకోకూడదు మరి ,ఓకే నా !"
"ఓకే! కానీయ్ మరి .అందరూ చూస్తున్నారు :నాకు ఏ లక్షణాలు అంటగడతావో  అని."
"ఆలోచెనలు తెగట్లా,ముందు మీ రూపం ఊహిస్తా -మీరు బేసి (ఆడ్) సంఖ్యలకు  చెందిన వారు కదూ !?"
"అవునో ,కాదో  గానీ -అలా ఎల్లా  ఊహించావూ?!"
"మరీ-ఒక స్థానం సంఖ్యలలో పెద్దది 9 ,రెండు స్థానాల సంఖ్యలలో  పెద్దది 99 ,అలాగే   999,9999,...................
మిమ్మల్ని ఊహించి రాస్తే ,మీ వంటి  నిండా అంతు లేకుండా తోమ్మిదులే కదా ,అప్పుడు మీ ఒకట్ల స్థానం లో ఉన్న 9 -మీరు ఒక సహజ బేసి సంఖ్య గా నిరూపిస్తోంది గదా . 9999......999......99999.ఇల్లా ఉండచ్చు మీ ..."
"దీనిని బట్టీ  ఇంకేమి ఊహించావూ?!"















"మీరు 3 లో  9 లో  నిశ్సేషంగా భాగించబడతారని ..."
"నిస్సందేహంగా ! అందుకే అనంత కాలాన్ని 3 రకాలుగా ఊహించారు."
"మీకు మిమ్మల్ని కూడినా లేక 2 తో  మిమ్మల్ని  గుణించినా  సరి  సంఖ్య  ఫలితమనీ ...."
"అంతేగదా !"
"మీలోంచి  1 తీసేసినా సరి సంఖ్యే వస్తుందనీ ..."
"ఊ ,కానీయ్ ...నాలోంచి నన్ను తీసేస్తే  ఫలితం సున్నా అనీ  సూన్యం అనీ ..."
"మాబాగా సెలవిచ్చారు .మిమ్మల్ని మీతోటే భాగిస్తే -'ఏకమేవా అద్వితీయం'-ఒక్కటే  జవాబనీ ..."
"నా పవర్ ఆఫ్ జీరో  కూడా ఒక్కటే ననీ -సరేనా ,మరీ ఇంతకీ నాకు ఒకటి కలిపితే వచ్చే సరి సంఖ్య మాట పక్కన పెట్టు, తర్వాతి స్థానాల సంఖ్యలలో నేనే అతి చిన్న దానిని అయ్యే ప్రమాదం వచ్చింది కదా ; మరి నా అతి పెద్దరికం  సంగతి ఏంటంటావ్ ?"
"అవునండోయ్ ,తీసేద్దాం కానీ కలపద్దు లెండీ !అవునూ, ఇది మీ ఇంటర్వ్యూ ,నాచేతేదో  చెప్పించు కోవటం కాదు గానీ , మీరే  మీ గురించి చెప్పండీ ."
"వింటావా  సరే :అనంతం గా ,శాస్వితంగా ఉన్నది ఒక్కటే ; అదీ ఈ భౌతిక సృష్టి లో ఒక్క సూన్యం మాత్రమే !
అదే నా విశ్వరూపం .నా గురించి మీ పూర్వ గణితానుభవం తో ఊహించినదీ ,అనుకుం టున్నదీ: అక్షర ,శబ్ద ఆకారాలతో  ఒట్టి గాలి కోట,నీటి మూట ,కలలో అద్దం లో ప్రతిబింబం : అర్ధం అవుతోందా!?"















"..........."
"ఒక పక్క నా గురించి అహర్నిశలూ పరిశోధించిన , పరిశోధి స్తూన్న,పరిశోధించబోయే  గణిత విద్యార్ధులూ,శాస్త్ర -జ్ఞ్యులు  0/0 = ?  ఒక్కటా ,సూన్యమా లేక నేనా (అనంతమా) అని కలవరిస్తూన్నారు ."
"........"
"మానవావిష్కరణ లలో గణితం అనంతం,శాస్వితం ,అమూల్యం అయినది .నన్ను నాపాటికి వదిలిపెట్టారు,గనకే గణితం యొక్క అగణితసాధన తో , సాయం తో మిగితా భౌతిక ,రసాయనిక , సాంకేతిక ,జీవ,సాంఘిక,వాణిజ్య శాస్త్రాలూ ...వాటి శాఖలూ,ఉప శాఖలూ  అభివృద్ది చెందగలుగు తున్నాయి ."
" వాటన్నిటి తరుఫున మీకు అనంత ,శాశ్విత కృతజ్ఞ్యతలు ,వందనాలు :చిన్నప్పటినుండీ , ఈ భూమ్మీదకి వచ్చినప్పటి నుండీ మీతో ముచ్చటించాలని చచ్చే ఇది గా ఉండేది.ఆ బెంగ తీరింది.ఇంక ఉంటాం."
"నా అనంత,శాశ్విత ఆశీసులు మీ గణిత విద్యార్దులకీ ,ఉపాసకులకీ ఎల్లప్పుడూ ఉంటాయి.శుభం." 
















                                                    @@@