1, ఆగస్టు 2014, శుక్రవారం

Tel.science musings:Competition between time& distance by rasp sadhana

tel.science musings."kaalam duuraala madhya pootee" by *mpsmkbh@







"కాలం దూరాల మధ్య పోటీ" -భట్ సాధన

"టైం ఎంత అయ్యిందిరా?"-విఘ్నేశ్వరున్ని అడిగాడు.-అమర్ మామయ్య  చుట్టూ చూశాడు.


టేబిలు పైన గ్లోబు తిరుగుతోంది.పైన లైటు వెలుగుతోంది.అశ్విక,అర్చన ఆడుకుంటున్నారు


పిల్లలకి ఈసారి అతను మరొక గమ్మత్తైన విషయం చెప్పబోతున్నాడు.చేతి కున్న వాచ్ ని చూస్తూ,


"సాయంత్రం ఐదున్నర..."-అన్నారంతా.


"ఎక్కడ?!"-అన్నాడు కళ్లెగరేస్తూ...

"నీ చేతి వాచీ లోనే..."అన్నారు పిల్లలు.యశ్వంత్,అభినవ్ సాగతీస్తూ.  

"మరి ఇంట్లో గోడమీది గడియారం లోనూ...?!"-

"అక్కడా అంతేగా...ఇంచుమించు".

"మరి పక్కింట్లో...?"

"అక్కడా అంతేగా..."

"మరి అవతలి వీధి బజారులోనూ...?"

"బజారులో ఎంటీ...బెజవాదలోనూ అంతే,బొంబాయ్ లోనూ అంతే "-ఆమాత్రం కూడా మామయ్యకి తెలీదా...అన్నట్లు.

"మంచిది,మరి పొరుగు దేశం పాకీస్తాన్ లో...?"

"అంతేనేమో!!..."-అన్నరంతానూ..

"ఏమీ కాదు,సరిగ్గా సాయంత్రం ఐదు గంటలు..."-అన్నాడు అమరు.

"పాకీస్తాన్ లో వాచీలన్నీ అర గంట లేటేమో.పాపం.?!"-అంది ఉల్లాసంగా ఉమా.

"కారణం అది కాదు గానీ,ఇంకో తమాషా...ఇటు బంగ్లాదేశ్ ఎంతయ్యిందో తెలుసా...?"

"ఏమో..."-అనుమానంగానే అన్నారంతా..

"అక్కడేమో సాయంత్రం ఆరు ,మరి..."

"ఆరా...అక్కడివన్నీ..ఫాస్టేమో..."అనేసింది-లక్ష్మీ.కళ్ళు తిప్పుతూ.. 

"ఇల్లా దేశదేశానికి టైము మారిపోతూ ఉంటే ,మరి కచ్చితంగా ఇప్పుడెంత అయినట్టూ...?"-కిరణ్ సూటిగా చూస్తూ....

"ఒక్క రేఖాంశానికి నాలుగు నిమిషాలు చొప్పున పడమటి నించి తూర్పు కి పెరుగుతూ/ ఐ మీన్ పెంచుతూ లెక్కిస్తారు...."-మామయ్య

"అయితే పది డిగ్రీ లకి నలభై నిమిషాలు తేడా నన్నమాట..."హవిష్ తేల్చేశాడు.

"అది అల్లాగుంచండీ,మనం మధ్యాహ్న్నం లంచ్ లాగించేస్తుంటే,ఆస్ట్రేలియా,న్యూజిలాండు వాళ్ళు హాయిగా ఆడేసుకుంటూ ఉంటారు.తెలిసిందా?!"-మామయ్య.

"అయితే,అదే టైముకి ఇంగ్లాడు వాళ్ళు మార్నింగు  బ్రషింగు  లో ఉమ్తారేమో..?!"-అంది భరణి వేళాకోళం గా..

"తమాషాకైనా నువ్వు చెప్పింది నిజమేనే భరణీ ,జీ.యం.టీ మైనస్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ,కరక్ట్ ..."-భరణి సంతోషానికి హద్దులు లేవు.

"అయితే అదే టైముకి అమెరికా వాళ్ళంతా గుర్రు పెట్టి ,ముసుగు తన్నుతూ ఉంటారు.కదూ."-సుదర్శనీ యాక్షన్ చేస్తూ అన్నది.












"అవునవును,వరల్డ్ కప్ రాత్రంతా మనం టీవీ లలో  చూస్తూంటే,ఆ దేశాల్లో పట్ట పగలు ,భలే..ఉందీ ఇదంతా."-అమూల్య సంతోషంగా అంది.

"మన భూమి గుండ్రంగా ఉందీ,పైగా గిర్రున తిరుగుతోంది గాబట్టీ..."అమృత కోవిద కనిపెట్టేసింది.

"అది కూడా పడమటి నించి తూర్పుకి ...అంతేకదా మామా ...?!"-సుమస్వర ముక్తాయింపు యిచ్చింది.

"ద్రువాలదగ్గర యింకో తమాషా జరుగుతూ ఉంటుంది తెలుసా!?..."-అమరు మామయ్య ...అందరూ నిశ్సబ్దంగా ఆశ్చర్య పోయారు.

"ఉత్తర ధృవం లో ఆరు నెల్ల రాత్రి,-అదే సమయంలో -"

"దక్షణ ధృవం లో ఆరు నెల్ల పగలు -అవునా మామా...?!"-సునేరీ కరక్ట్ గా గెస్ చేసింది.

"ఇకపోతే,ఆ రెండు ధ్రువాల్లో సూర్యుడి ప్రయాణం మన దగ్గరలాగా ఉండదు.తెలుసునా?!"

"తూర్పున బయలుదేరీ,పడమటికి చేరుతాడు."-అమరు మామ సస్పెన్సు మొహం పెట్టాడు.

"ఇక్కడకూడా అంతేగా,దీనిలో తమాషా ఏముందీ?!-కొంపదీసి,మధ్యలో మూడు నెలలకి దక్షిణానికిగానీ చేరతాడా ఏమిటి?!"

-సాధన మొత్తానికి సందేహం లోంచి కూడా విజ్ఞ్యానం సాధించింది.మామయ్య -

"అందుకే కాలం అంటే ఒక ...."అని ఏదో చెప్పబోయేంతలో-

"అన్నాలకి టైము అయ్యింది లోపలికి రండర్రా..."అంటూ అమ్మమ్మ చూడామణి పిలిచేసింది.










                        

                         @@@

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి