1, ఆగస్టు 2014, శుక్రవారం

Science musings :competition between time &speed by rasp sadhana

science musings"kaalamtho vegam potee"-by *mpsmkbh@

























కాలంతో వేగం పోటీ-   

-సాధన భట్

అపుడు సమయం ఉదయం పది గంటలు,ఆదివారం.అమర్ మామయ్య చుట్టూ పిల్లలున్నారు.
"యేమర్రా మనమ్ యెక్కడ జీవిస్తున్నాము?"
"సందేహం యేముందీ,భూమ్మీద"-కొందరు బయటికీ,కొంతమంది లోపలికీ సమాధానం ఇచ్చారు -ఒక్కసారిగా.
"ఆల్ రైట్,మనంకూచున్నచోటు -మనకి యెంత దూరంలొ ఉందనుకుంటున్నారు?"
సీరియస్ గా అడిగాడు మామయ్య;
అదేమిటి తమాషా ప్రశ్న!-అనుకున్నారు అంతా-పిచ్చి ప్రశ్న అంటే బాగోదని;
"నిజంగానే ఇది గొప్ప ప్రశ్నే;దీనికి జవాబులు మాత్రం రెండున్నాయి-తెలుసా?"

"యేమీ లేదనుకుంటుంటే,రెండున్నాయా-సమాధానాలు"-అనుకున్నారంతానూ.మిగితావాళ్ళ కళ్ళ మెరుపులలో జవాబులు దొరుకుతాయేమొనని ఒకర్ని ఒకరు చూసుకున్నారు పిల్లలు. "సున్నా కిలోమీటర్లు-మొదటి జవాబు ఇదేకదూ"-ఉమ అన్నది నిశ్చయం గా,నవ్వేస్తూ- "కరక్టే..."అన్నారు కొద్దిగా పెద్ద క్లాసులు చదువుతున్న భరణీ,సుదర్శనీ-వంటివారు. "మరి రెండో జవాబు ఆలోచించండీ..."-కవ్వించారు-కిరణ్ లక్ష్మీ; "భూమ్మీద కదా,దాని ఆకారం 'క్లూ'-యేనా మామా..."-అన్నారు సుమస్వరా,సునేరీ ఒక్కేసారి.

"ఆ అర్ధం అయ్యింది,మనం కూర్చోని ఉన్నచోటు -మన నుంచి 39,940 కిలొమీటర్లు దూరం ఉంటుంది.-అంతేనా మామా"-అన్నారు హవిష్,అమూల్య-99% నమ్మకంగా,1% సందేహంగా. "అదెల్లా!?"- కోవిదా,అభినవ్-ధైర్యంగా సందేహించారు. "అదీ భూమి చుట్టుకొలత కదా,-అని ముక్తాయింపు పాడారు -అశ్విక,కార్తికేయా,అర్చన. "అవును,ఇక్కడనుంచి బయలుదేరి సూటిగా వెళ్తూ ఉంటే,39,940 కిలోమీటర్లకి మళ్ళీ బయలుదేరినచోటికే వస్తాం-కదూ మామా..."-అన్నాడు విఘ్నేశ్వరుడు. "కరెక్ట్,రెండు సమాధానాలకు కారణం మనం పోల్చుకున్న దిక్కు బట్టీ ఉంటుంది-అన్నమాట.పోనీండి." 

"మరి రోదశీ-అంటే సూన్యంలో ఈ దూరాల గురించి-అప్పుడెప్పుడో కొన్ని తమాషాలు చెబుతానన్నావుగా మామా..."అని అమూల్య గారంగా అడిగింది.
"అది మరోసారి చూద్దాం,మీరంతా వెళ్ళి,మీ హెచ్ డబల్యూలు చేసేసుకోండి." సశేషించాడు అమర్ మామ.










                                                   @@@

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి