1, ఆగస్టు 2014, శుక్రవారం

Science musings :competition among time, distance &speed by rasp sadhana

Tel.scince musings "kaalam,duuram,veegala madhya potee" *mpsmkbh@















"కాలమ్,దూరం,వేగాల మధ్య పోటీ"-సాధన భట్

అమర్ మామయ్య చుట్టూ మూగిన పిల్లలని-మాటలతో రోదశీ లోకి తీసికెళ్ళాడు.
'మనం ఈసారి రోదశీలో దూరాలగురించి చూద్దాం!"
"మన భుమి నుంచి చంద్రుడు 384 వేల కిలోమీటర్లు దూరంలో ఉన్నాడు కదా..."అమూల్య చెప్పేసింది.
"అల్లాగే-సూర్యుడు 15 కోట్ల కిలొమీటర్లు దూరమ్లో ఉన్నాడు గా..."హవిష్ ఊరుకోలేదు.
"మరి మిగతా నక్షత్రాల మాటేమిటీ!?"-సాధన సాగతీసింది.
"మన గెలాక్శీలో అవీ సూర్యుడిలాంటివే.
అంతకన్నా పెద్దవీ,చిన్నవీ-కోటానుకోట్లు చాలానే ఉన్నాయి.కొన్నిటికి మన సూర్యుడిలాగానే గ్రహాలు,ఉపగ్రహాలు కూడా ఉన్నాయి."

"వాటిని అల్లాగె ఉంచండి గానీ,వాటిల్లో-'ప్రాక్శిమా సెంచరీ'-అనే పొరుగు నక్షత్రం ఎంత దూరంలో ఉందో తెలుసా!?-నాలుగున్నర కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.అంటే..."
"కాంతికి అక్కడికి వెళ్ళి,వచ్చేయడానికి 9 యేళ్ళు పడుతుంది-అన్నమాట".కిరణ్ మామకి సాయం చేశాడు-తన వెగంలో
"పాపం కాంతికి స్పీడు తక్కువా!?"భరణి జాలిపడింది.
"కాదూ,కాంతి వేగం ఇంతా,అంతా గాదు-ఒక్క సెకనులో మూడు లక్షల కిలోమీటర్లు లాగించేస్తుంది తెలుసా!?"-లక్ష్మి అక్కడున్న వారినందర్నీ ఉలిక్కిపడేలా చేసింది.













"మన జెట్ విమానాలు సెకనుకు ఐదున్నర కిలొమీటర్లతో నడుస్తూఉంటాయి, రోదశీ రాకెట్లు సెకనుకి పన్నెండు కిలొమీటర్లతో దూసుకుపోతూఉంటాయి-కదా"-ఉమ తన వేగాన్ని చూపించింది.

"ఇక పోతే-మన రాకెట్ని కాంతి వేగంతో నడపగలిగితే అది ఆ 'ప్రాక్శిమా సెంచెరీ' కి 9 యేళ్ళల్లో వెళ్ళి వస్తుంది;"-అమర్ మామ కేసి తరువాత యేమి తమాషా వినిపిస్తాడోనని చుస్తున్నారంతానూ;
"ఈ కాంతిరాకెట్ కన్నా స్పీడుగా ఒక్క నెల రోజుల్లో   వెళ్ళి, వచ్చేస్తే సరిపోతుందిగా..."అనేసింది సుదర్శని అమిత వేగంగా.
"అప్పుడు మీ వయసు యేమన్నా మారుతుందా?"
"అబ్బే యేమీ మారదు.."-అనేశారంతానూ.
"లేదు, ఒక్క నెల మారుతుంది-కదా"-
"ఆ అవునూ ఒక్క నెల మారుతుంది,ఐతే-?!"
"యేమవుతుందంటే... నీ క్లాస్ మేట్స్ అందరూ ఇంకా తొమ్మిది తరగతులు దాటిపోయి ఉంటారు".

ఒక 40 కాంతి సంవత్సరాల దూరంలొ ఉన్న ఒక నక్షత్రం దగ్గరికి మనం ,మీరన్నట్లే ఇంకా వేగంగా నిమిషంలో వెళ్ళీ వచ్చేశాం అనుకోండీ. అప్పుడు మీరన్నట్లే, మీ వయసు ఒక్క నిమిషం దాటుతుంది కదా;-కానీ, ఇక్కడ భూమ్మీద యేమవుతుందో తెలుసా-80 యేళ్ళు దాటేస్తుంది.మీకేమన్నా అర్ధం అయ్యిందా?!?!"
-అమర్ మామ అన్నది వారందరికీ 'భయంకరం' గా అర్ధం అయిపోయింది.
"__అని ఒక రష్యన్ పుస్తకంలో 'ఐన్ స్టిన్'-సాపేక్ష సిధ్ధాంతం గురించి వివరిస్తూ-లాన్డావ్,రూమెర్ సైన్స్ రచయితలు చెప్పారు.-అని ముగించాడు అమర్ మామ.











                                                                @@@

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి